నంద్యాల పట్టణ పెద్దలకు , ప్రజలకు, మరియు శ్రేయోభిలాష్యులకు ధన్యవాదములు
మన "హలో నంద్యాల " ను తయారు చేయడం కొరకు కారణం ఏమనగా మన నంద్యాల పట్టణంలో వున్నా వ్యాపారస్తులు ,
చేతి వృత్తుల వారు అలాగే పట్టణ ప్రజలు కూడా కరోనా సమయం నుండి వ్యాపారాలు లేక మరియు పనులు లేక అనేక ఇబ్బందులకు గురౌతున్నారు .
మన"హలో నంద్యాల " పట్టణం లోని వ్యాపారస్తులు , చేతి వృత్తులు వారు , వారి యొక్క ఫ్యామిలీ వారికీ, మిత్రులకు, మరియు
శ్రేయోభిలాష్యులకు, మాత్రమే తెలియడం జరుగుతుంది. కానీ కొత్తగా ప్రజలు రావడం లేదు . ఎందుకు అనగా మనము ఉన్నాము అని ప్రజలకు తెలియక పోవడం.
అందువలన చాల మంది ప్రజలు అలాగే వ్యాపారస్తులు , చేతి వృత్తులు వారు అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది .
మన"హలో నంద్యాల "గమనించిన విషయం ఏమనగా ప్రజలు , వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు . వస్తువు వున్నా చోట ప్రజలు ఉండరు , పని వున్నా చోట చేతి వృత్తుల వారు వుండరు. అందువలన అందరిని ఒక చోటుకు
చేర్చడమే మన "హలో నంద్యాల "యొక్క ముఖ్య ఉద్దేశం .
మన"హలో నంద్యాల "ముఖ్య ఉద్దేశం పలు రంగాలలో వున్నా వారిని మేము వున్నాము అన్ని ప్రతి ఒక్కరికి అనగా
పట్టణ మరియు పల్లె ప్రజలకు తెలియపరచడం కొరకు, కొత్తవారికి మన వ్యాపారాన్ని మరియు మన వృత్తులను తెలియపరచడం కొరకు ఈ ఒక్క
మన "హలో నంద్యాల " ను తయారు చేయడం జరుగుతుంది .
మన "హలో నంద్యాల "వలన మేము వున్నాము అని ప్రతి ఒక్కరికి అనగా వ్యాపారస్తుల వారికీ , చేతి వృత్తుల వారికీ ప్రతిరోజు ఒక్క
పండుగల సంతోషంగా వారి వారి వృత్తులలో విశేషంగా రాణించాలని అందరూ ఆనందంగా ఉండాలి అనేది మన"హలో నంద్యాల "యొక్క లక్ష్యం .
నంద్యాల పట్టణ పెద్దలు , మిత్రులు , శ్రేయోభిలాష్యులు మన "హలో నంద్యాల "ను ఆదరిస్తారని మీ యొక్క ఆశీర్వాదములు
ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ
ఇట్లు
మీ
శ్రేయోభిలాషి
"హలో నంద్యాల "